Science and technology competitive exam guidance
అభ్యర్థులకు ఒక ముఖ్య సూచన వివిధ పోటీ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులు 'సైన్స్' అండ్ టెక్నాలజీ పరంగా వైవిధ్యభరిత మైన అంశాలను అధ్యయనం చేయవలసి వుంది. ప్రధానంగా మన దేశం రాష్ట్ర, సాంకేతిక రంగాలలో సాధించిన వర్తమాన ప్రగతిని గూర్చి తెలుసుకోవాలి. బిట్స్తో పాటు భారత్ సాధించిన వర్తమాన ప్రగతిని, ఆయా విశేషాలను మననం చేసుకోవలసి వుంది. ప్రాచీన కాలం నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఎంతో ప్రగతిని సాధించింది. స్వాతంత్ర్యం అనంతరం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మౌలిక సదుపాయాలు పెద్దగా అందుబాటులో లేకపోవడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆశించిన ప్రగతి కనిపించ లేదు. స్వాతంత్య్రం అనంతరం రెండు దశాబ్దాల పాటు ఈ రంగాల్లో పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి : మానవవనరుల కల్పన, పారిశ్రామికీకరణకు ప్రభుత్వం కృషి చేసింది. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి . 1958లో ప్రభుత్వం సైన్స్ విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 1983లో, 2003లో ఈ విధానంలో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. వీటన్నింటి ఫలితంగా గత నాలుగు దశాబ్దాలుగా శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ ఎంతో అభివృద్ధిని సాధించింది.. అంతరిక్షరంగం : కేవలం కొన...