Science and technology competitive exam guidance
అభ్యర్థులకు ఒక ముఖ్య సూచన
వివిధ పోటీ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులు 'సైన్స్' అండ్ టెక్నాలజీ పరంగా వైవిధ్యభరిత మైన అంశాలను అధ్యయనం చేయవలసి వుంది. ప్రధానంగా మన దేశం రాష్ట్ర, సాంకేతిక రంగాలలో సాధించిన వర్తమాన ప్రగతిని గూర్చి తెలుసుకోవాలి. బిట్స్తో పాటు భారత్ సాధించిన వర్తమాన ప్రగతిని, ఆయా విశేషాలను మననం చేసుకోవలసి వుంది.
ప్రాచీన కాలం నుంచి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ఎంతో ప్రగతిని సాధించింది. స్వాతంత్ర్యం అనంతరం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మౌలిక సదుపాయాలు పెద్దగా అందుబాటులో లేకపోవడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆశించిన ప్రగతి కనిపించ లేదు. స్వాతంత్య్రం అనంతరం రెండు దశాబ్దాల పాటు ఈ రంగాల్లో పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి : మానవవనరుల కల్పన, పారిశ్రామికీకరణకు ప్రభుత్వం కృషి చేసింది. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి . 1958లో ప్రభుత్వం సైన్స్ విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 1983లో, 2003లో ఈ విధానంలో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. వీటన్నింటి ఫలితంగా గత నాలుగు దశాబ్దాలుగా శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ ఎంతో అభివృద్ధిని సాధించింది..
అంతరిక్షరంగం : కేవలం కొన్ని దేశాలకే పరిమితమైన అంతరిక్షవిజ్ఞానాన్ని భారత్ అభివృద్ధి
చేసింది. అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలోని ఇస్రో అంతరిక్ష ప్రయోగాల ద్వారా దేశ సామాజిక, ఆర్థిక ప్రగతికి కృషి చేసింది. ఇన్నేట్ వ్యవస్థలో భాగంగా ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు, టెలికమ్యూనికేషన్స్, రేడియో, టెలివిజన్, బ్రాడ్ కాస్టింగ్, వాతావరణ సమాచార సేకరణ రంగాల్లో తమ సేవలు అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రయోగించిన ఇన్సాట్-40, 40, 4సీఆర్, జీశాట్-8, జీశాట్-12 లాంటి ఉపగ్రహాలు, శాటిలైట్ నిర్వహణ, టెలిమెడిసిన్ రంగాల్లో సేవలు అందిస్తున్నాయి. దేశీయ పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్లను కూడా ఇస్రో అభివృద్ధి చేసింది. ఐఆర్ఎస్ వ్యవస్థలోని ఉపగ్రహాలు ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రయోగించిన రిసోర్స్ శాట్-2, ఓషన్ శాట్-2, కార్బోలాట్-2, 2ఎ, 2బి, రీశాట్-2 ఉపగ్రహాలు అత్యాధునిక స్పెన్సర్ల ద్వారా సహజ వనరుల పరిశీలన, నిర్వహణ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విపత్తు నిర్వహణకు కృషి చేస్తున్నాయి. 18 వరుస విజయవంత ప్రయోగాలను నమోదు చేసుకున్న పీఎస్ఎల్వీ, 22 దేశీయ ఉపగ్రహాలతో పాటు 26 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా మన అంతరిక్షసేవలను విస్తరించడంలో దోహదపడుతోంది. అంతరిక్ష రంగంలో ఇస్రో అధిగమించిన మరో మైలురాయి చంద్రయాన్-1.
అణుశక్తి: భారత అణుశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం 20 రియాక్టర్ల ద్వారా 4780 Mee స్థాపిత సామర్థ్యం సాధించాం. భవిష్యత్లో FBR (ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (AHITIS ద్వారా దేశ స్థూల శక్తి ఉత్పాదనలో అణుశక్తి వాటాను మరింత పెంచే అవకాశం ఉంది. ఆమోదించిన, ప్రతిపాదించిన రియాక్టర్ల నిర్మాణం పూర్తయితే 2035-2040 నాటికి 70,000 Mee అణుశక్తి సాధించడం సాధ్యమవుతుంది. శక్తి ఉత్పాదనతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో ఉపయోగపడే అనేక రేడియో ధార్మిక ఐసోటోప్ లు, వైద్య పరికరాలు కూడా అణుశక్తి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
రక్షణరంగం: సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అగ్ని, పృధ్వి, ఆకాశ్, త్రిశూల్,
నాగ్ వంటి క్షిపణులను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం రెండంచెల బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (BMD) సిస్టమ్ను భారత్ అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యవస్థలో శత్రు క్షిపణులు మన దేశంలోని లక్ష్యాలను చేరుకునే ముందే, వాటిని రెండు స్థాయిల్లో అడ్డుకొని (Interception) నాశనం చేసే రెండు క్షిపణులు అభివృద్ధి చెందుతున్నాయి. 1) వృథ్వి ఎయిర్ డిఫెన్స్, 2) అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, గగనతలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే అత్యాధునిక అస్త్రక్షిపణిని కూడా ఇటీవల భారత్ అభివృద్ధిచేసి ప్రయోగించింది..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఐటీ, టెలీ కమ్యూనికేషన్ రంగంలో ఇటీవల వేగవంతమైన అభివృద్ధిని.
భారత్ సాధించింది. 2004 ఏప్రిల్ నుంచి 2009 మార్చి వరకు వైర్లెస్ కమ్యూనికేషన్ సేవలు ఏటా 60% పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. 2009 డిసెంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 174.58 మిలియన్ ఫోన్ కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. 2009 డిసెంబర్ నాటికి 7.98 మిలియన్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులున్నారు. 2006 మే లో భారత ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ ఈ - గవర్నెన్స్ ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో పాలన కోసం 27 మిషన్ మోడ్ ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో నిర్వహణలో ఉన్నాయి. 2009-10 ఆర్థిక సంవత్సరంలో భారత్ సాఫ్ట్వేర్ల ఎగుమతుల విలువ 49.7 బిలియన్ డాలర్లు. నానోటెక్నాలజీ ఇనీషియేటివ్ కార్యక్రమంలో భాగంగా నానో ఎలక్ట్రానిక్స్లో పరిశోధనను ఐటీ విభాగం ప్రోత్సహిస్తుంది.
విపత్తు నిర్వహణ 2005 డిసెంబర్ 23న జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అమల్లోకి రావడంతో అత్యాధునిక విపత్తు నిర్వహణ వ్యవస్థను భారత్ అభివృద్ధి చేసింది. తుపాను, వరద, భూకంపం, సునామీ, కరువు వంటి సహజ విపత్తుల సమగ్ర నిర్వహణ కోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే కార్యక్రమం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కింద
ప్రారంభమైంది. ఇందులో భాగంగా విపత్తు, విపత్తు సంబంధిత 15 అంశాలకు చెందిన మార్గదర్శకాలను ఎన్డీఎంఏ విడుదల చేసింది. మరో 11 అంశాలకు చెందిన మార్గదర్శకాలను కూడా విడుదలచేయనుంది. హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) వద్ద సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఏర్పాటు, వాతావరణ సమాచార నిల్వకు వరం సూపర్ కంప్యూటర్ వినియోగం, తుపాను అంచనా కోసం ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ ఏర్పాటు, శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలను ఎదుర్కొనే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్లైమేట్ ఛేంజ్ (NAPCC) ప్రణాళికలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
బయోటెక్నాలజీ: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇది ఒకటి. 2010
నాటికే ఈ రంగంలో వార్షిక టర్నోవర్ 10 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. టిష్యూ కల్చర్, బయోమెడికల్ డివైసిస్, బయోమెట్రిక్స్, నానోబయోటెక్నాలజీ, జన్యుమార్పిడి, పంటల, జీవ ఎరువులు, జీవ క్రిమిసంహారకాలు, డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఆక్వాకల్చర్, రీకాంబినెంట్ టీకాలు, బయోఇన్ ఫార్మేటిక్స్, బయోరిమిడియేషన్, జీవ ఇంధనాలు మొదలైన అంశాల్లో భారత్ ఎంతో ప్రగతి సాధించింది.
ఈ తరహాలో కమ్యూనికేషన్ రంగంలో తాజా పరిణామాలు, చంద్రయాన్, అంతరిక్ష పరిశోధనలు, 'ఇస్రో' ప్రయోగాలు, కృత్రిమ ఉపగ్రహాలు మొదలైన అంశాలన్నిటినీ అవగాహన చేసుకుంటే జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టుల మీద సాధికారత లభిస్తుంది. వివిధ పోటీ పరీక్షలలో ఈ అంశాల మీద రాగల ప్రశ్నలకు సుళువుగా సమాధానాలు రాయవచ్చు.
అకడమిక్ పరీక్ష లేదా పోటీ పరీక్ష అయినా సైన్స్ సంబంధిత అంశాలకు ప్రిపేర్ కావడం. చాలా సులభం. అయితే ప్రతి ఒక్క అంశాన్ని ఎందుకు? ఏమిటి ?? ఏ విధంగా ??? అనే . ప్రశ్నల ద్వారా సమాధానాలను స్ఫురింపచేసుకోవడమే సైన్స్ ప్రిపరేషన్కు ప్రధానం. సైన్స్ సబ్బన్లకు సంబంధించి అడిగే ప్రశ్నలకు స్పష్టమైన జవాబులు మన పరిధిలోనే ఉంటాయి. వివిధ పోటీ పరీక్షల సిలజన్లు, గత ప్రశ్నాపత్రాల నేపథ్యంతో రూపొందించిన, ఒక స్పష్టమైన పద్ధతి ప్రకారం సంకలనం చేసిన ఈ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు-జవాబులను అధ్యయనం చేయండి. జీవశాస్త్రంలో ముఖ్యాంశాలైన సూక్ష్మజీవులు - వాటి వలన కలిగే వ్యాధులు, ఆరోగ్య పరిరక్షణ, శరీర ధర్మశాస్త్రం, పర్యావరణం, కాలుష్యం, వన్యమృగ సంరక్షణ, జెనిటిక్ ఇంజనీరింగ్ మొదలైన.. వివిధ భాగాల నుంచి రాగల ప్రశ్నలన్నింటికీ జవాబులు ఈ చిరుగ్రంథంలో ఇమడ్చటం జరిగింది.
మనం రాసే జవాబులు నిర్దిష్టత ఒక ఎత్తు అయితే, మన చేతిరాత మరొక ఎత్తు. పరీక్ష రాసేటప్పుడు ఏ మాత్రం తడబాటు లేకుండా, సుస్పష్టంగా రాయడం అవసరం. జవాబులలో పలు ఇంగ్లిష్ పదాలు లేదా తెలుగు భాషాంతరీకరణంలో వస్తుంటాయి. వీటిని శ్రద్ధతో, జాగ్రత్తగా ఆలోచించి తప్పులు లేకుండా రాయాలి. పేపర్ దిద్దేవారికి మన రాత అర్ధం. అయితీరాలనే లక్ష్యంతో, కుదురుగా కూర్చొని రాయాలి. వేగవంతంగానూ రాయాలి. ఇందుకు ప్రారంభదశ నుండి ప్రాక్టీస్ వుంటేనే మనం నెగ్గుకు రాగలం. అంకెలు రాసేటప్పుడు మరీ జాగ్రత్త అవసరం. ఒత్తి పెట్టిరాయడం ఏమాత్రం మంచిదికాదు. మన చేతిరాతను అనుసరించి కూడా మార్కులను నిర్ణయించడానికి అవకాశం ఉంది.
విస్తృతమైన స్టడీమెటీరియల్ను చూసి మనం కంగారు పడనవసరం లేదు. కొంచెం గ్రహణశక్తి, మరికొంచెం జిజ్ఞాస, ఆసక్తి వుంటే జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మన గుప్పిట్లో ఇమిడిపోతుంది. జవాబులలో సంబంధిత నేపథ్యాన్ని అధ్యయనం చేసి రాయడంలో మన ప్రజ్ఞకు గుర్తింపు వస్తుంది. ఈ చిరుపుస్తకంలోని ప్రశ్నలు - జవాబులు గమనించితే ఈ అంశం తేటతెల్లమవుతుంది.
మన అధ్యయనం ఎన్నటికీ వృథా కాబోదని గుర్తుంచుకోండి. మనసు పెట్టి ప్రశ్నలు-జవాబు లను చదవండి. స్కోరింగ్కు కూడా అవకాశం వుంటుంది. మన మెదడు మనం ఊహించ లేనంత శక్తిమంతమైనది. అనంతమైన శక్తి వున్న మన మెదడును పాజిటివ్ దృక్పథంతో పని చేయించటమే సక్సెస్ మంత్రం. జయాపజయాలు మన మెదడులోనే నిర్ణయమవుతాయి. కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ను ఖచ్చితమైన ప్రణాళికతో ప్రారంభించి, ఆసక్తి, అనురక్తితో చదివితే సానుకూల ఫలితాలు మన కాళ్ళ దగ్గరికే వస్తాయి.
All the best
Comments
Post a Comment